సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, బుధవారం బలుసుమూడిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ,మాజీ ఎంపీ, తోట సీతారామలక్ష్మి చీపుర పట్టి వీధులను శుభ్రం చేసి చెత్తను బుట్టలో వేసి ట్రాక్టర్లో వేశారు. ఆమె మాట్లాడుతూ.. కుటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త పారిశుద్ధ్య విప్లవాన్ని తీసుకువచ్చిందని, అందమైన పట్టణాలను నిర్మించాలనే లక్ష్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నేరుగా క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నిజమైన పరిశుభ్రతను సాధించగలమన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రభుత్వంతోపాటు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఎ రాంబాబు, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, మావుళ్ళమ్మ దేవస్థాన ట్రస్ట్ సభ్యులు ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, పామర్తి వెంకట్రామయ్య, ఎద్దు ఏసుపాదం, టీవీవీ ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *