సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: గత సోమవారం ఇరాన్ నియంతరణ లోని హర్ముజ్ జలసంధి దగ్గరగా వచ్చిందని అమెరికా హెలికాఫ్టర్ అపాచీ ని ఇరాన్ దళాలు కూల్చివేశామని ఆరోపిస్తూ నిన్న ఇరాన్ లోని టెహ్రాన్‌‌ను లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్‌ కమాండ్‌ భీకర దాడులు చేస్తోంది.అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అరబ్ దేశాలలోని బ్రేహ్రయిన్ , కువైట్, జోర్డాన్ దేశాలలోని అమెరికాకు చెందిన 18 కీలక ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ దాడులు, మిసైల్ దాడులు నిర్వహిస్తున్నాయి. హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.తమ హెచ్చరికలు పక్కనపెట్టి హోర్ముజ్‌ దాటితే దాడులు తప్పవని హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేసి ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు తెలిపారు.. అయితే, ట్రంప్ కామెంట్లను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. . ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు మా ప్రతిదాడులతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *