సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: .ఏపీలో 3పార్టీల కూటమి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు,శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు , డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ ఏపీ అడ్జక్షుడు మాధవ్ లు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక మంత్రి నారా లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడుతూ.. మా .కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించామని.. దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమ అంటే ఎన్టీఆర్‌కు చాలా ప్రేమ అని తెలిపారు. అందుకే రాయల్‌సీమగా మార్చామని మంత్రి చెప్పారు. రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌ అని కొనియాడారు. గొడ్డలి పార్టీ అరాచక పాలన చూశామన్నారు. వైసీపీ అరాచకాలు చూస్తూ ఊరుకోమని.. రెడ్‌బుక్’ దాని పని అది చేసుకుంటూపోతుందని స్పష్టం చేశారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘మనది గూగుల్‌… వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్‌జెట్‌.. అంటూ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *