సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉదయం భీమవరం పట్టణం శివారులోని చిన అమిరంలో సాగిరాజు అచ్యుత్తమ రామ రాజు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి శాంతి ఆశ్రమాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సందర్శించారు. సుమారు 100 మందికి పైగా వృద్ధులు నివసిస్తున్న ఈ ఆశ్రమం దాతల సహకారంతో సమర్థవంతంగా నిర్వహించబడుతూ, వారికి అవసరమైన సేవలు, సంరక్షణ మరియు సౌకర్యాలు అందిస్తున్నందుకు ఆశ్రమ నిర్వాహకులను రఘురామా అభినందించారు.అక్కడి వృద్దులను వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్ననిర్వాకులును అభినందిస్తూ వారి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *