సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి యుద్ధం తక్కువ బడ్జెట్ లో ఎలా చేయవచ్చో? తన బలం బలహీనతలు తెలుసుకొని శత్రువుపై ఎదురుదాడులు చెయ్యడమే కాకుండా ప్రపంచం ముందు అమెరికా ను ఎలా దోషిగా నిలబెట్టవచ్చో ? కోట్ల రూపాయల ఆయుధాలను వేల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఫైబర్ డ్రోన్స్ తో ఎలా నెల నాకించవచ్చో ‘పేద దేశం’ ఇరాన్ ప్రపంచానికి కొత్త యుద్ధ పాఠాలు నేర్పింది.. అంతే కాదు ట్రంప్ అహంకారాన్ని, ప్రపంచ ఆర్ధిక రంగాన్ని తన ప్యూహాత్మక హర్ముజ్ ఉక్కు పిడికిలి తో ఎలా నలిపి వేసిందో చూసారు. అమెరికా ఇజ్రాయిల్ మొదలు పెట్టిన యుద్ధం ఆఖరికి ఇరాన్ అంగీకరిస్తేనే .. కరుణిస్తేనే యుద్ధం ముగిసింది. ఈ విషయం తాజగా గా ట్రంప్ సైతం అంగీకరించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో (బీబీ) వ్యవహారం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఒక దశలో ఇరాన్‌తో వెంట్రుక వాసిలో తమకు డీల్ కుప్పకూలే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఇరాన్‌తో డీల్‌కు కొన్ని గంటల ముందే బీబీ ఆదేశంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దాడులు చేసిందని చెప్పారు. ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో డీల్ కుదుర్చుకోవడంలో మళ్లీ జాప్యం జరిగిందని ట్రంప్ తెలిపారు. చివరకు ఇరాన్ పెద్ద మనస్సు చేసుకోవడం తో కొన్ని గంటల ఆలస్యంగా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ‘ఆయనతో (నెతన్యాహు) వ్యవహారం చాలా కష్టం. వాస్తవానికి ఆయన యూఎస్‌పై కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే.. ఇంత పోరాట పటిమ ఉన్న ఇరాన్ చేతికి నిజంగా అణ్వాయుధం దక్కి ఉంటే ఇజ్రాయెల్ రెండు గంటల్లో భూమ్మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేది’ అని ఇజ్రాయిల్ ను హెచ్చరించారు.
