సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర లోనే నాకు దిక్కు లేదు నేను తెలంగాణలో… అన్న ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్ పూర్తిగా రూటు మార్చారు. ఢిల్లీలో జరుగుతున్నా జనసేన ఆవిర్భావ వేడుకల్లో దక్షిణాది కి చెందిన రాష్ట్రాల నుండి జనసేన నేతలు వారితో సమావేశాలు ద్వారా జాతీయ స్థాయి పార్టీగా జనసేన ను రూపొందిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర రావ్ ను ఏపీ పోలీసులతో అరెస్ట్ కు విఫల యత్నం తరువాత.. తెలంగాణ కీలక నేతలు సైతం తనను తీవ్ర స్థాయిలో ప్రత్యక్షముగా లేదా పరోక్షంగా హెచ్చరించినప్పటికీ .. ‘రేవంత్ రెడ్డి మంచోడు;.. ‘కేటీఆర్ ఏమి చెప్పిన నా మంచికే చెప్పి ఉంటాడు’ అని సర్దుకుపోయిన ‘పవన్ ఢిల్లీలో మాత్రం తాజగా.. చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ ను, ఇటు 10ఏళ్ళు పాలించిన బి ఆర్ ఎస్, నేతలతో తాడోపేడో తేల్చుకొనే దిశలోనే ఉన్నాయి. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలలో.. ‘భారత్ జోడో’ యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు. కానీ, నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు. నాకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉంది.’’ తెలంగాణ ఉద్యమంలో యువతను బలిచేసి నాయకులు( బిఆర్ ఎస్ ?) గద్దెనెక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో చదువుకునే పిల్లలు 1200 మంది అమరులైతే వాళ్లను గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవడం లేదా? అని ప్రశ్నించారు. ఈ రోజు అందరూ ‘జెన్-జీ’ గురించి మాట్లాడుతున్నారని, అయితే, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన యువతకు ఏం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1200 మందికి నివాళులర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వలేదని విమర్శించారు. కర్ణాటకకు చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మూసి నది వరదల నివారణకు కృషి చేసిన మహానుభావుడు. ప్రధాని మోదీ మన దేశానికి గొప్పదనం!అని దేశం నీ ఇల్లు అయితే.. రాష్ట్రమనే ఏ గదిలో నువ్వున్నా ఇల్లంతా నీదే అవుతుంది అన్నారు, ముగింపు ఉపన్యాసంలో పవన్
