సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలని నేడు, మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని విమర్శిస్తూ.. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత వ్యవహార శైలిపై ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలఫై పవన్ స్వాందిస్తూ తాను ఆ మాజీ మంత్రి వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారంటూ వ్యాఖ్యానించారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, గౌరవంగా ఉండాలని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు కేవలం హోం మంత్రి అనిత గారిని అన్నట్టే కాదని..రాష్ట్రంలో సగటు మహిళలందరినీ కించపరచినట్లే అని పవన్ ఆగ్రహాం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *