సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాతో జరిగిన ఒప్పందానికి విరుద్ధంగా లెబనాన్ ఫై ఇజ్రాయిల్ ఇంకా బీకర దాడులు కొనసాగిస్తుండటంతో దానికి నిరసనగా మరల హర్ముజ్ ను మూసివేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ తాజగా కీలక ప్రకటన విడుదల చేసారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ప్రస్తుతం ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అయితే 60 రోజుల తరువాత ఇరాన్‌తో తుది చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే హర్ముజ్ ను ఆధీనంలోకి తీసుకోని అటుగా వెళ్లే నౌక లపై టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకుంటామని వెల్లడించారు. కాగా, ఇరాన్‌తో అణు తయారీ నిరోధకానికి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం స్విట్జర్లాండ్‌కు పయనమైంది.కాగా, ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని గత శనివారం 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో 55 వాణిజ్య నౌకలు హోర్ముజ్‌ను దాటాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ప్రకటించారు.
