సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల రోజుల క్రితమే లాక్ ఆప్ మర్డర్ చేసారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జనసేన కార్యకర్త , రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్)ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాశ్‌ను నియమించింది. ఇందులో ముగ్గురు సభ్యులుగా ఐపీఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు నేడు, ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో సభ్యులుగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ ఉంటారుమరో వైపు ఈ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సింగ్ నగర్‌లోని ఓ ఇంటిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను కూడా పోలీస్ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాయికృష్ణ తల్లి ఆరోపణల నేపథ్యంలో ఆయా అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. సాయి కృష్ణ అదృశ్యం కి కొద్దీ రోజుల ముందే విజయవాడ లోనే మాదిగ నేత కుమారుడు శ్రీ కాంత్’ కూడా సీఐ నాగరాజు టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాలబడుతున్నట్టు వీడియో లో పేర్కొనడం తెలుగు రాష్ట్రాలలో సీఐ నాగరాజు దర్పం వెనుక ఎవరు ఉన్నారు? అన్న అంశం ఫై మరింత వేడి పెంచింది.
