సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజక వర్గంలోని 4 మండలాలు లోని రైతులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రా అసెంబ్లీ ఉపసభాపతి రఘురామా కృష్ణంరాజు 6కోట్ల 59 లక్షల రూపాయల ను వారి అకౌంట్స్ లోకి విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఛెక్ విడుదల సందర్భముగా రఘురామా.. మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పధకం క్రింద కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 2వ ఏడాది మొదటి విడతగా ఈ డబ్బు రైతుల ఎకౌంట్స్ లోకి వేస్తున్నామని ఇదే విధంగా భవిషత్తు లో వ్యసాయం చేసే ‘ఆక్వా’ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అండ దండలు , వ్యవసాయ పరికరాలు యంత్రాలు ఫై సబ్సిడీలు అందుతాయని అందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు మరియు కూటమి నేతలు, రైతులు విశేషంగా పాల్గొన్నారు.
