సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని సంపూర్ణ స్వర్ణ మయం అలంకరణ చెయ్యాలని తెలుగువారే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న “బంగారు తల్లి“భక్తుల ఆకాంక్ష .. ఆదిశగా అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి.నేడు, ఆదివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన రంగిశెట్టి జగదీష్ బాబు సుభాషిణి దంపతులు సుమారు లక్ష ఏబై వేలు రూపాయలు విలువ కల 10 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు.ఆలయ అర్చకులు ,దేవాలయ సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి ఫొటో, ప్రసాదం అందచేశారు..
