సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం ఆఖరి రోజైన శుక్రవారం నాటి స్వల్ప నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం (జూన్ 22) భారత స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువన కొనసాగడం కూడా భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ సూచీల వివరాలు ఇలా ఉన్నాయి. నేటి ఉదయం మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 400 పాయింట్స్ పైగా లాభాలు సాధించింది. అయితే చివరకు నిఫ్టీ 50 (NIFTY 50) సూచీ నేటి ట్రేడింగ్‌లో 89.80 పాయింట్లు (0.37శాతం) లాభపడి 24,102.90 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ (BSE SENSEX)సూచీ 291.17 పాయింట్లు లాభం తో (0.38శాతం) పెరిగి 77,094.07 వద్ద స్థిరపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *