సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు ఈ కేసులో అత్యంత ప్రాధాన్యం కలిగిన సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్ లో మాయమైనట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (దాదాపు నెల రోజుల పాటు) ఉన్న పూర్తి సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. నెల రోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట, రెండు రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మాత్రమే ఉంచి, మిగతాదంతా డిలీట్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవలే ఈ కేసు విచారణ సందర్భంగా.. నెల రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అత్యంత భద్రంగా దాచాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఫుటేజ్ మాయం కావడం వెనుక.. పెద్ద తల ఉందని వైసీపీ నేత అంబటి రాంబాబు నేటి మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జనసేన కార్యకర్త సాయి కృష్ణపై మిద 2 కేసులు ఉంటె 22 కేసులు అంటూపచ్చమీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలని నిజానికి గాదె సాయికృష్ణను పోలీస్ లతో చంపించిన ఆ ‘పెద్ద తల’ వ్యవహారం బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగవలసిందేనని అంబటి రాంబాబు డిమాండ్ చేసారు.
