సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాలు సకాలంలో పడకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కవగా కూరగాయలు దిగుమతి చేసుకోవడం, అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినవి తగ్గించకపోవడంతో రవాణా చార్జీలు పెరిగి, ఆంధ్ర రాష్ట్రంతో పాటు పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం కూరగాయల ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 30 శాతం వరకు ధరలు పెరిగాయి. ఉల్లిపాయ ధరలు ఇప్పటికి కేజీ 25 -30 కి అందుబాటులో ఉన్న . కిలో టమాటా రూ.60-70 వరకు చేరుకుంది.. ఇక కాకరకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బీరకాయ, చిక్కుడు , క్యాప్సికం, చిలకడ దుంప, కంద ధరలు కిలో 70 నుండి 100 రూపాయలకు కూడా పెరిగాయి. గతంలో కిలో కాకరకాయ రూ.30 ఉంటె ఇప్పుడు రూ.60కి చేరుకుంది. అలాగే తోటకూర గోంగూర కట్ట 20 రూపాయలు చప్పున , మెంతికూర కట్ట 30-40 రూపాయలు కు ధరలు కూడా పెరిగాయి. మామిడి పండ్లు బంగిలిబిల్లి వచ్చి పరక 13కాయలు 500 నుండి 800 రూపాయలు వరకు భీమవరంలోనే ధర పలుకుతుందంటే..? వర్షాలు బాగా పడితే కాస్త ధరలు తగ్గే అవకాశం ఉంది.
