సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,శనివారం అమరావతి లో పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. వైసీపీ పార్టీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని, వారి విధివిధానాలను ప్రశ్నిస్తే.. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. జనసేన ను అసలు పట్టించుకోవద్దని వారి అధినేత సూచనలు ఇచ్చారని తెలిసింది. మన నేతలు ‘మెత్తగా ఉండాలి కానీ.. మరీ మౌనంగా ఉంటే చేతకానితనంగా చూస్తారు. ఇటీవల పంతం నానాజీ మాట్లాడింది నేను చూశాను. అటువంటి వ్యాక్యలు సమర్థించం. కానీ అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ నేత ఏం మాట్లాడారో? ఆ పార్టీ నాయకులకు తెలీదా. మీకు నోరుంది కదా అని అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు వారికీ 11సీట్లు వచ్చిన కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు.. అయితే .వైసీపీ వారు మమ్మలిని తిట్టినా.. తిట్టకపోయినా.. మా జనసేన బలపడటం గ్యారంటీ’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రజలు ఓట్లు వేయరని..ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఇందుకు వైసీపీనే అందరికీ నిదర్శనమన్నారు. జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లే కార్యకర్తే సాధక్ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల మంది సభ్యత్వం కోసం సాథకులు పని చేశారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ పని చేస్తుంది వారిలో . 18వేల మంది సాధక్లను నాయకత్వ దిశగా తీసుకెళ్తే.. మంచి ఫలితాలు వస్తాయని పవన్ అన్నారు.
‘
