సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: . భీమవరంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో భట్టిప్రోలు ను లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు బొండా రాంబాబు నూతన అధ్యక్షులు గోపిశెట్టి మురళీకృష్ణ నూతన ఫెమినా క్లబ్ అధ్యక్షులు మహిళ అధ్యక్షురాలు డా భూపతిరాజు ఐశ్వర్యలయన్స్ క్లబ్ సభ్యులు సత్కరించారు. భీమవరం పట్టణంలో జరిగే ప్రతి సేవా కార్యక్రమంలోనూ లయన్స్ క్లబ్ ద్వారా జరిగే కార్యక్రమంలో సుదీర్ఘ కాలంగా భట్టిప్రోలు అందిస్తున్న సేవలు ఎనలేనివని అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో లయన్ చిలువూరి కృష్ణంరాజు, లయన్ డా ఎం వీ సూర్యనారాయణ రాజు,లయన్ ఆర్ వీ సూర్యనారాయణ రాజు, లయన్ వి వి కృష్ణంరాజు,లయన్ వబిలిశెట్టి కనకరాజు, తదితరులు పాల్గొన్నారు
