సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో టెంక్షన్ తో ఎదురుచూస్తోన్న AP EAPCET 2026 ఫలితాలు ఊహించని విధంగా వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడని కారణంగా EAPCET ఫలితాలు వాయిదా పడినట్లు తెలుస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం ఎప్సెట్ ఫలితాలను జులై 2న(గురువారం ) విడుదల చేయనున్నా రు. గత మే 12 నుంచి 20 వరకు ఎప్సెట్ పరీక్షలు జరగ్గా.. దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
