సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఉండే భీమవరం జోన్ లోని ఆక్వా రైతులు తమను దళారీల బారి నుండి సిండికేట్స్ బారినుండి, ఆక్వా ఫీడ్స్ అధిక ధరలు( కేజీ కి 10 నుండి 12 రూపాయలు పెంచేసిన ) బారి నుండి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని విద్యుతు సబ్సిడీలు అమలు చెయ్యాలని గత 5నెలలుగా చేస్తున్న ఉద్యమాలకు మరింత ఊపు తేవడానికి నేడు ఇచ్చిన బంద్ మేరకు రైతులు తమ ఆక్వా వ్యవసాయ కార్యకలాపాలు అన్ని నిలిపివేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. వీరికి మద్దతుగా భీమవరం. ఉండి , వీరవాసరం, నర్సాపురం పాలకొల్లు లలో ఆక్వా ఫీడ్ అమ్మే షాపులు కూడా మూసివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *