సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ వాయిస్ అనుకరిస్తూ అదే తీరులో వాహభావాలతో ఏలూరులో జూన్ 28న జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రఘురామా కృష్ణంరాజు, రాధా మనోహర్దాస్లపై యు ట్యూబర్’ప్రశ్న’ రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీనితో పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న బుధవారం పిఠాపురం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. అయితే, వేలాది మంది దళిత నేతలు, పోలీస్ స్టేషన్ ను ముట్టడించడం తదితర ఉద్రిక్త పరిణామాలు తరువాత (జడ శ్రవణ్ కుమార్ కూడా అక్కడికి రావడం).. . చివరికి అతడిని నిన్న రాత్రి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్ట్ పోలీస్ రిమాండ్ ను నిరాకరిస్తూ బెయిల్ ఇచ్చింది.అయితే బెయిల్‌పై విడుదలైన వెంటనే, మరో కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. గత ఏడాది 2025లో గొల్లప్రోలు మండలంలో పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య ఘర్షణగా ఎందుకు చిత్రీకరిస్తూ వీడియో చేశారని కేసు పెట్టి అతనిని పోలీసులు విచారిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పలుమారులు నా కొడకల్లా.. అంటూ బూతులు తిట్టినా కేసులు లేవు. అరెస్టులు లేవు ఒక్క మాట అంటే ఇదేమి ధర్మం అంటూ దళిత నేతలు బగ్గు మంటున్నరు.
