సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,715 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు జాబులు సంబంధిత వివరాలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా – 1,900 ,కెనరా బ్యాంక్ – 1,500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 1,100, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 504, బ్యాంక్ ఆఫ్ ఇండియా – 500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 500, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 161, విద్యార్హత:ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.కనీస వయస్సు – 20 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అన్ని అర్హతలను పరిశీలించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *