సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర లో భాగంగా నేడు గురువారం నగరోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు గురువారం ప్రారంభించారు. దేవస్థానము, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థాన ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ, అర్చక బృoదం ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరి కాయ కొట్టి అమ్మవారి నగరోత్సవాన్ని ప్రారంభించారు. జాతర మహోత్సవము నిర్వహణ నిమిత్తం దేవస్థానము నుండి రూ 4 లక్షలను ఎమ్మెల్యే చేతుల మీదుగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు,నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి సభ్యులు, కూటమి నేతలు శ్రీఅమ్మవారి భక్తులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *