సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ ఫై పరుష వ్యాక్యలు చేసిన నేపథ్యంలో సంచలనం సృష్టించిన ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న ఛానెల్ జోసెఫ్ రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి పిఠాపురం, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లలో పెట్టినప్పటికీ పోలీస్ కస్టడీ కి కోర్ట్ అనుమతి ఇవ్వకుండా అతనికి బెయిల్ ఇవ్వడంతో ఆ 2 చోట్ల అతను విడుదల కాగానే, ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం నగుదురు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని అతనిని అరెస్ట్ చేసి అక్కడికి తరలించారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిన్న కాకినాడలో అతనిపై జనసేన కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి కి ప్రయత్నించినా నేపథ్యంలో అతనికి రక్షణగా దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పీఎస్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్టేషన్‌ గేట్లను మూసివేసిన పోలీసులు.. ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్‌ఛార్జి ఉడుముల బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో రావణ్‌పై కేసు నమోదు కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *