సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర దేవాలయ ఆవరణ అందమైన దీపాల వెలుగులో వందలాది కళాకారుల ప్రదర్సనలు తో భారీ బాణాసంచా కాల్పులు తో ఘనంగా జరిగింది. గత శుక్రవారం మద్యాహ్నం పుష్ప అలంకారం చేసిన వాహనంపై శ్రీ అమ్మవారి నగరోత్సవం ఘనంగా పట్టణ విధుల గుండా తిరిగి రాత్రి ఆలయం చేరుకొన్నారు.. స్థానిక నీరుల్లి కూరగాయ వర్తకసంఘం, ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారం మరియు రాష్ట్ర దేవాదాయ సహకారంతో( 4లక్షలు రూపాయలు ఇచ్చారు) జాతరకు ఏర్పాట్లు చేసారు. శ్రీ అమ్మవారి నగర ఊరేగింపులో బాణాసంచా కాల్పులు,గరగల నృత్యాలు, కోలాటాలు ,శక్తి వేషాలు తో సందడి గా జరిగింది. ఆలయ ఆవరణ లో గత రాత్రి బేతాళ నృత్యాలు, శక్తి వేషాలు, బుట్టబొమ్మలు, డప్పుల బృందాలు.. కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకొన్నాయి. అయితే గత దశాబ్దం తో పోలిస్తే మాత్రం.. తిరుమల బ్రహ్మోత్సవాల స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే వందలాది కళాకారులతో అద్భుత ఐటమ్స్ తో మహోజ్వలంగా జరిగే జేష్ఠమాస జాతర నిర్వహణ ‘స్థాయి’ తగ్గుతూ వస్తుంది అన్నది మాత్రం నిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *