సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈ జూలై 11న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సివిల్ కేసులు రాజీకి ప్రయత్నం చేయాలని, రాజీకి ఏమాత్రం అవకాశమున్న ఇరుపార్టీలకు కౌన్సిలింగ్ ఇస్తే రాజీపడతారనీ, కక్షిదారులకు తమ కేసులను రాజీ చేసుకునే హక్కు ఎప్పుడూ ఉంటుందనీ, కేసులను రాజీ చేసుకుంటే కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు తెలియజేయాలని, భీమవరం న్యాయవాదులు కేసుల రాజీకి ముందుంటారని, అదే విధంగా ఈసారి జరగబోయే లోక్ అదాలత్ లో క్రిమినల్ తో పాటు సివిల్ కేసుల రాజీకి ప్రాధాన్యతను ఇవ్వాలని” భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్ధ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr. B. లక్ష్మీనారాయణ అన్నారు.
