సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ.. పలువురు విద్యార్థుల క్షోభ కు కారణమైన నీట్‌-2026 పరీక్షల్లో అవకతవలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేడు, గురువారం 19వ రోజుకు చేరింది. ఇప్పటికే 8.9 కిలోల బరువు తగ్గారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మండిపడ్డారు. వాంగ్‌చుక్‌ ఉద్యమానికి సంఘీభావంగానేడు గురువారం(16న) దేశవ్యాప్తంగా నిర్వహించే సామూహిక నిరాహార దీక్షలో పాలుపంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతు గా దేశవ్యాప్తంగా పలువురువిద్యార్థులు నిరసన చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఆయనతో చర్చించే దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై నేడు, గురువారం విచారణ జరగనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *