సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా శ్రీ అమ్మవారి అనుగ్రహం కోసం పలు వార్డులలో శ్రీ అమ్మవారిని ప్రతిష్ట చేసి జాతరలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరంలో 3వ వార్డులో ప్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 34వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 38వ వార్డు లంకపేటలో అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 35వ వార్డు సూర్యనారాయణ పురం యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మెంటే పార్ధ సారధిలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వాడవాడలా అమ్మవార్ల జాతరను వారంవారం నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు చెనమల్ల చంద్రశేఖర్, షబీన బేగం, స్థానిక భక్తులు యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
