సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి నేడు, ఆదివారం, ఆషాడమాసం సందర్భంగా స్థానిక ‘ఇన్నర్ వీల్ క్లబ్’ మహిళా సభ్యులు శ్రీ అమ్మవారిని తమ ఇంటా ఆడపడుచుగా భావిస్తూ .. వివిధ రకాల పండ్లు,స్వీట్స్,చీర,గాజులు పూలతో భారీ స్థాయిలో సారి సమర్పించారు. ఆలయ అర్చకులు మహిళ భక్తులకు పూజలు ఆశీర్వచనాలు అందించారు. ఆలయం అంతటా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది.
