సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్న ఈ పర్యటన ప్రస్తుతం రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ పర్యటనలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం. ఆగస్టు 1న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. నేటి రాత్రి ఢిల్లీ లో బస చేసి గురువారం ఉదయం తిరిగి విజయవాడ చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *