సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వైసీపీ పార్టీ మహిళా అడ్జక్షురాలు కోడె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నేడు, బుధవారం పట్టణ వీధుల గుండా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు . వారు ప్రకాశం చోక్ మీదుగా అంబెడ్కర్ విగ్రహం సెంటర్ కు చేరుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక .మహిళకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలు ఫై పసిపిల్లలపై అరాచకాలు హత్యలు పెచ్చుమీరాయని రాజ్యాంగం ద్వారా తమకు రక్షణ కల్పించాలని విన్నతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీ వాళ్లే మహిళలపై దాడులు చేస్తున్నారని, ఇక్కడ అరాచక వాదులు కు శిక్షలు పడటం లేదని ప్రజలను మహిళను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇటీవల గుంటూరు లో తమకు లంచం ఇవ్వకుండా మున్సిపల్ నీళ్ల టాప్ కు బోరు మోటారు వేసిన ఒక మహిళా ను నడి రోడ్డుపై వివస్త్రను చేసిన స్థానిక డివిజన్ టీడీపీ నేత ఆయన కుటుంబ సభ్యులు చేసిన దాడి ని చూసి సమాజం సిగ్గు తో తలవంచుకొంటుందని , బాధిత మహిళకు స్థానిక మహిళా టీడీపీ ఎమ్మెల్యే కూడా న్నాయం చెయ్యలేదని మహిళా హోమ్ మిస్టర్ హయాంలోనే దేశంలోనే ప్రతిరోజూ అత్యధిక దాడులు ఏపీలో జరుగుతుండటం ఘోరమైన విషయమని .. నిందితులకు కఠిన శిక్షలు వెయ్యేలని మహిళకు రక్షణగా వైసీపీ శ్రేణులు అండగా ఉంటాయని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *