సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో మోడీ ప్రభుత్వ హయాంలో అంత అవినీతి మయంగా మారిందని.. ఆఖరికి విద్యార్థుల కష్టానికి ఫలితం లేదని మీ అవినీతికి వారి భవిషత్తు లు నాశనం చేస్తున్నారని ‘గత 10 ఏళ్లల్లో 152 పేపర్ లీక్ ఉదంతాలు’ వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా రాహుల్ గాంధీ నేడు బుధవారం ఏర్పాటు చేసిన పత్రికాసమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహము వ్యక్తం చేసారు.ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ మొత్తం రిగ్గింగ్ బారిన పడిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరు అసమర్థంగా, అవినీతిమయంగా ఉందని ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
