సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీట్ పేపర్ లీక్..విద్యార్థుల ఆత్మహత్యలు అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున యువత చేస్తున్న తీవ్ర ఆందోళనలు నేడు, గురువారం కూడా కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాలపై మెట్రో ట్రైన్స్, ఇంటర్ నెట్ సర్వీస్ ఆయా ప్రాంతాలలో నిలిపివేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా కు అంగీకరిస్తే తప్పు చేసినట్లు ప్రజల లోకి వెళుతుందని భావిస్తూ కేంద్రం దిగిరావడం లేదు. దీనితో చదువుకొన్న యువత చేస్తున్న పోరాటం వారిపై పోలీసులు చేస్తున్న లాఠీ చార్జీలు ఫై ఆగ్రహం పెళ్లుబిక్కుతుంది. ప్రస్తుతం ఉద్యమం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు పాకింది. రేపు దేశవ్యాప్తంగా అన్ని విద్య సంస్థలు మూసివేయాలని విద్యార్థి సంఘము నేతలు పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా నేడు, గురువారం . ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభను కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ ఉదంతానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *