సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కోరికోరి ఇరాన్ ఫై దాడి చేసి రాజేసిన యుద్ధ జ్వాలలు ఇప్పటిలో ఆగేలా లేవు.. వారిని లేపి తన్నించుకొంటున్న తీరు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంది. అమెరికా యుద్దాన్ని వదిలించుకొందామన్న ఇరాన్ వదలటం లేదు. ఇరాన్ దేశంఫై అమెరికా ఎన్ని మిసైల్స్ దాడులు చేస్తున్న సరే లెక్కేచెయ్యకుండా .. ప్రతి దాడులతో ..తన ఉక్కు కౌగిలి లో ట్రంప్ ను అతనిని నమ్ముకొన్న గల్ఫ్ దేశాలను , ఒక రకంగా ప్రపంచదేశాలను కూడా గత 5 నెలలుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తాజగా సౌదీ చమురు బావులపై కూడా బాంబు దాడులు చేస్తూ.. వారు చమురు ఎగుమతులు చెయ్యకుండా వారి నౌకలను హౌతిల సహకారంతో ఎర్ర సముద్రం పోర్ట్ లను దిగ్బంధం చేస్తున్న తీరుకు, దుబాయి లో అమెరికా వ్యాపార టెక్నో సంస్థలపై దాడులు చూసి ప్రపంచం నివ్వెరబోతుంది. అయితే తాజగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన కాల్పుల విరమణ (Ceasefire) ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ప్రతిపాదనను ఇరాక్ ప్రధానమంత్రి ద్వారా టెహ్రాన్‌కు చేరవేసినట్టు సమాచారం. అయితే, కొద్ది రోజులపాటు యుద్ధాన్ని నిలిపివేయడం సమస్యకు పరిష్కారం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో అమెరికా లేదా దాని మిత్రదేశాల నుంచి మళ్లీ దాడులు జరగవని స్పష్టమైన భద్రతా హామీలు, శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీసే రాజకీయ చర్చలు అవసరమని టెహ్రాన్ పేర్కొన్నట్లు సమాచారం.
