సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై చేయడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హర్షం వ్యక్తం చేసారు.. యువతకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు, సంస్థలకు ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. జంతర్ మంతర్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. బొద్దింకల సత్తా అందరికీ తెలిసిందని అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు ఇంతకాలంగా చేస్తున్న పోరాటానికి కొంతమేర న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది విద్యార్థుల విజయమని అన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో తమని తాము బాద్షాలుగా భావిస్తున్న వారిని దారిలోకి తేవాల్సిన అవసరం యువతకు ఉందని అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పాలకులను అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని దానికి ముందడుగు పడిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *