సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నిన్న ఆదివారం నేడు సోమవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 55–65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నేటి మధ్యాహ్నం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉండి,మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తమగా భారీ వర్షాలు పడుతున్నాయి. గత అర్ధరాత్రి నుండి నేటి సోమవారం తెల్లవారు జము వరకు భీమవరం లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలల్లో అండర్ టర్నల్ లలో నీరు చేరింది. ఇంకా చిరు జల్లులు పడుతున్నాయి. గత ఆదివారం సాయంత్రం కూడా కేవలం 10 నిమిషుల పాటు భారీ వర్షం పడటం గమనార్హం.
