సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి గత 2 రోజులుగా చర్చలు జరుగుతున్నా నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3 శాతం తగ్గి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరింత తగ్గే అవకాశం ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.24) గా ఉంది.. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం దేశీయ మార్కెట్ లో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు (76,059)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 600 పాయిట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 76,687 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా ప్రస్తుతం 176 పాయింట్ల లాభంతో 23,943 వద్ద ఉంది
