సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం 6 వార్డ్ బొక్కవారిపాలెం నుండి ఎన్డీఏ కూటమి రెండేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నేడు, సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు, భీమవరం నియోజకవర్గ సంక్షేమం,అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ..గత వైసిపి పాలనవల్ల గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ కూటమీ ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో అనేక పరిశ్రమలు, వ్యాపార పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు ఏళ్ళ లోనే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చారని , ఇప్పుడు ఇంటింటా టీడీపీ నేతలు తిరుగుతూ ప్రజల లకు ప్రభుత్వ పదకాల అమలు తీరు వివరిస్తూ వారి సమస్యలు కూడా తెలుసుకొని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకోని వెళతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *