సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ విద్య శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ DSC పరీక్షలలో జరిగిన స్కాం లకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని మాజీ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి లోకేష్ రాజీనామా చెయ్యాలని నినాదాలతో ప్లై కార్డ్స్ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద వైసీపీ శ్రేణులల్తో భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ మం త్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. నీట్ పరీక్షలలో అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేసారని, అంతకు మించి ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరిక్ష రాసిన డీఎస్సీ పరీక్షలలో జరిగిన అక్రమాలకు రాష్ట్ర మంత్రి లోకేష్ ఎందుకు ఇప్పటివరకు రాజీనామా చెయ్యలేదని ప్రశ్నించారు. ఉపాధి లేక ఎందరు యువత ఆత్మహత్యలకు పాలబడుతున్నారని, నెలకు 3వేలు రూపాయలు నిరుద్యోగ భృతి హామీ ఎగ్గొట్టారని, DSCపోస్టులు లక్షలాది రూపాయలకు అమ్మేసుకొన్నారని ఆరోపించారు. 420 జీవో తీసు కొచ్చి .. 427 పోస్టు లు అనర్హులకు ఇచ్చా రు. ఆ పరీక్షాల లో అక్రమాలపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఇది .. మెగా డీఎస్సీ కాదు .. దగా డీఎస్సీ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.
