సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త! జాబ్ క్యాలెండర్-2026 అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తొలి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మిగతా నియామకాలకు కూడా స్పష్టమైన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాలతో ఈ దశలో స్వల్ప ఆలస్యం జరిగినా ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్ తేదీని ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రెండు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఏపీప్రభుత్వం ప్రకటించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *