సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని, హీరోగా పరిచయమవుతూ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పణలో RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక కీలక పాత్రలలో మోహన్ బాబు, కిక్ శ్యామ్, వాసుకి, నరేష్, బ్రహ్మాజీ.. పలువురు నటించారు. .కథ విషయానికొస్తే.. తిరుపతిలో పెద్దిరెడ్డి(కిక్ శ్యామ్)పెద్ద మోతుబరీ, పరువు గురించి ఆలోచించే మనిషి. అతన్ని చంపి ఎలాగైనా తిరుపతిని ఏలాలి అని నారాయణప్ప(వడ్లమాని శ్రీనివాస్) ట్రై చేస్తూ ఉంటాడు. తిరుపతికి కొత్తగా వచ్చిన మన హీరో శ్రీను(జయ కృష్ణ) చూసిన మొదటి చూపులోనే పెద్దిరెడ్డి కూతురు మంగ(రషా తడాని)ని ఇష్టపడి, ఆమె వెనక పడి దగ్గరవుతాడు. కానీ మంగకు మరో వ్యక్తితో నిశ్చితార్థం అవ్వడంతో షాక్ అవుతాడు. శ్రీను మంగను ఇబ్బందిపెట్టడం చూసి పెద్దిరెడ్డి తమ్ముడు అతన్ని కొట్టి చంపడానికి తీసుకెళ్తుంటే లక్ష్మీపతి(అజయ్) గ్యాంగ్ వీళ్ళ మీద దాడి చేస్తుంది. అసలు శ్రీను ఎవరు? అతని గతం ఏంటి? బళ్లారిని గడగడలాడించే వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కి శ్రీను కథకు సంబంధం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. విశ్లేషణకు వస్తే.. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ ప్రేమకథ. అయితే ఇంటర్వెల్ కి పెద్దిరెడ్డి చెల్లి ఎంట్రీ ఇచ్చి శ్రీనుని కలవడంతో ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో శ్రీను గతం, వెంకటప్పయ్య నాయుడు ఎంట్రన్స్ తో మరింత ఆసక్తిగా మంచి ఎమోషన్స్, ఎలివేషన్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ హెవీగా చూపించి క్లైమాక్స్ లోముగింపు సింపుల్ గా ఇచ్చారు అనిపిస్తుంది. కానీ తిరుపతి బ్యాక్ డ్రాప్ లో కాస్త కొత్త లుక్ కథనంతో ట్రై చేసారు. జయ కృష్ణ మొదటి సినిమా అయినా తన నటనతో పర్వాలేదు. డ్యాన్స్ బాగానే వేసాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో మాత్రం బాగా మెప్పించాడు. చాన్నాళ్ల తర్వాత కీలకమైన మోహన్ బాబుకి పవర్ ఫుల్ పాత్ర పడింది. చెలరేగిపోయాడు. ఆయన పాత్ర కు మరిన్ని సన్నివేశాలు ఉంటె బాగుండు అనిపిస్తుంది. నరేష్ అక్కడక్కడా నవ్వించారు. కిక్ శ్యామ్ తొలిసారి తన కెరీర్లో భిన్నమైన పాత్ర పోషించారు. వాసుకి హీరోయిన్ అత్త పాత్రలో బాగానే నటించింది. కెమెరా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా ఇచ్చారు కానీ పాటలు యావరేజ్.మొత్తంగా ‘శ్రీనివాస మంగాపురం’ అజయ్ భూపతి చేసిన కృషి.. కమర్షియల్ గా తెరకెక్కిన ప్రేమకథ ఫలితం దక్కినట్లే.. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు పండుగే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *