సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సన్నిహితులకు చెందిన యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ‘విడుదల కు సిద్ధం అయిన ‘కొరియన్ కనకరాజు’ను సుదీర్ఘ కాలంగా నిర్మించాయి. భీమవరంలో గత రాత్రి జరిగిన ‘కొరియన్ కనకరాజు’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యువతను బాగా అలరించింది. శ్రీ మావుళ్ళమ్మవారి దయతో మరోసారి భీమవరం వచ్చానని సుమ వ్యాఖ్యానం ఆమెకు గజ మాల సత్కారం హైలైట్ గా హీరో కొణిదల వరుణ్ తేజ్ రితికా నాయ లు సమక్షంలో అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా రాత్రి 8 దాటాక ప్రారంభమైన ఈ వెంట్ మంచి జోషుగా సాగింది. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. గత కొంతకాలంగా పరాజయాలతో ఉన్నపటికీ ఈసారి ప్రేక్షకులను నిరాశపరచనని ప్రకటించారు. కొరియన్ కనకరాజు’లోని కొరియా దెయ్యం కు చెందిన వినోదం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, చుసిన వారికీ కొన్ని కొరియన్ పదాలు కూడా వచ్చేస్తాయని ప్రకటించారు. కామెడియన్ సత్య రాలేదు.వేదికపై తమన్ సంగీత ఈవెంట్, భీమవరం బులిరాజు మాటలు సభికులను అలరించాయి. ఇందులో ఓ పాటనే కొరియన్ పదంతో రంగరించి రూపొందించడం విశేషం.
