సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో దశాబ్దాల పోరాటాల తరువాత లక్షలాది బెలూచి యోధుల మరణాలు తరువాత పాకిస్థాన్ నుంచి విడిపోయామని ప్రకటించిన బలూచిస్తాన్ ఆగస్ట్ 11ను తమ స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించింది. ప్రస్తుత పాకిస్తాన్ లో 45 శాతం భూభాగం ఉండి కేవలం 2కోట్ల పైగా జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో అంతర్జాతీయ సమాజం కూడా తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని తమతోనే కొత్త ఒప్పందాలు చేసుకోవాలని, కొత్త రాజ్యాంగం కూడా అమలు అవుతుందని విజ్ఞప్తి చేసింది. బ్రిటీష్ వారు వెళ్ళిపోయాక 1947 ఆగస్ట్ 11నే బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించిందని పేర్కొంది.( కానీ పాకిస్తాన్ 1948 లో తన సైనిక బలంతో కబ్జా చేసింది) అయితే ఈ ప్రకటనకు ప్రస్తుతం పాకిస్థాన్ అంగీకారం లేదు. అలాగే ఐక్యరాజ్యసమితి సహా ఏ దేశం కూడా బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. తమపై ఏ నియంత్రణ లేని పాకిస్థాన్ నుంచి తాము విడిపోయామని ప్రకటించిన నేపథ్యంలో బలూచిస్తాన్ ఇక నుంచి తమది స్వతంత్ర దేశమని.. దాని పేరు ‘ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ‘ అని పేర్కొంది.
