సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ని భీమవరంపట్టణ శివారు పెదమిరం లోని వారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి, వారు గత కొంతకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న అనంతరం, సంబంధిత అధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా తన వంతు కృషి చేస్తానని రఘురామకృష్ణ రాజు వారికీ హామీ ఇచ్చారు.
