సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నౌవుడురు గ్రామంలో నేడు, గురువారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేసి మాట్లాడారు. పేదవారు రూపాయి, రూపాయి దాచుకుని కొనుకున్న భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించే దిశగా పట్టాదార్ పాస్ బుక్ తో రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. గతంలో నిర్వహించిన రీ సర్వేలో జరిగిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిచేసి రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులందరికీ అందజేస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం రైతులకు పాస్ బుక్ లను అందించారు. కార్యక్రమంలోరైతులు, గ్రామస్థులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.
