సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె హఫీసా బేగం (24) మృతి చెందారు. ఆమెతో పాటు కారులో తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్‌ (జిమ్‌ నిర్వాహకుడు), అవినాష్, సుధీర్, షేక్‌ ఆసిఫా, వంశీ స్నేహితులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కారు ముందు వెళ్తున్న లారీ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను తాకి ఆగిపోయింది. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆసిఫా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *