సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 5 నెలలుగా రాష్ట్రంలో ఆక్వా పంటకు ఎగుమతులకు రాజధానిగా భాసిల్లుతున్న భీమవరం జోన్ లో పెద్ద ఎత్తున సిండికేట్ లకు వ్యతిరేకంగా ఆందోళన లు తో ఉద్యమిస్తున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతులకు (Aqua ) కొంత వెసులుబాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు, మంగళవారం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీపై నేడు,మంగళవారం ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నంబర్- 57 జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు రూ.1.50లకే యూనిట్ రాయితీని ఏపీ సర్కార్ కల్పించనుంది. APSADA, CAA చట్టాల కింద రిజిస్టరైన అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రూ.1.50లకే యూనిట్ విద్యుత్‌ను ఏపీ సర్కార్ అందించనుంది. సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తించనుంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి రూ.1.50లకే యూనిట్ రాయితీని అమలు చేస్తారు.
