సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: 2వ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో పిర్యాడికల్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా స్టిల్స్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గొప్ప హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా నిన్న బుధవారం రాత్రి భీమవరంలో ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మైత్రి మూవీస్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ…. ‘ఫౌజీ’ మూవీ గురించి మాట్లాడారు. భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ మూవీ వేరే లెవల్ లో ఉంటుందని హైప్ ఎక్కించారు. ప్రభాస్ ఒకేసారి మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు.“రోజూ మార్నింగ్ 8 గంటల నుంచి ఈవెనింగ్ 6.30 గంటల వరకు ప్రభాస్ అన్న ‘ఫౌజీ’ షూటింగ్ లోనే ఉంటున్నారు. ఇంత బిజీగా ఉన్న హీరో ఎవరైనా షూటింగ్ లేకపోతే రెస్ట్ తీసుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తన షూట్ లేకపోయినా సెట్స్ కి వెళ్లి మానిటర్ ముందు కూర్చుని పౌజి షూటింగ్ సన్నివేశాలు స్వయంగా పరిశీలిస్తున్నారు అని తెలిపారు. మొన్న ప్రభాస్ తో నేను మీ భీమవరం వెళుతున్నాను .. ఇరుముడి ప్రీ రిలీజ్ వేడుకకు SRKR ఇంజనీరింగ్ కాలేజీకి.. అక్కడ మీరు అడిగినట్లు మీవాళ్ళకు ఏమైనా చెప్పాలా? అని అడిగితె ప్రభాస్ పెద్దగా నవ్వి..అక్కడి స్టూడెంట్స్ ను బాగా చదువుకొని భవిషత్తులో ఉన్నతంగా ఉండాలని చెప్పండి అన్నారు. అని నిర్మాత ప్రకటించారు. ఇంతకీ పౌజి సినిమా ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *