సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లో కూటమి ఎమ్మెల్యేల హావ కొనసాగుతున్న ఇప్పటికి శాసనమండలిలో ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్సీ ల బలం అలానే ఉండటంతో మండలి చైర్మెన్ గా కొయ్య మోషేను రాజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పదవి కాలం ముగియడంతో శాసన మండలి డిప్యూ టీ చైర్మ న్ పదవికి మాత్రం మరోసారి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో .. వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు వైసీపీ సభ్యుల బలం దృష్ట్యా అయన ఎన్నిక లాంఛనం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ లో శాసన సభ్యుల సమావేశాలు నేపథ్యంలో అసెంబ్లీ కి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోయినా.. శాసనమండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీ లు ప్రజా సమస్యలను బలంగా వినిపించాలని జగన్ పిలుపు నిచ్చారు.
