సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో యనమదురు కాల్వ వారగా నిర్మాణాలు తొలగించి రోడ్డు వేస్తున్న నేపథ్యంలో DNR ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఉన్న మహిమానిత శ్రీదుర్గా లక్ష్మీ అమ్మవారి ఆలయం అక్కడే ఎదురుగ ఉన్న స్థలంలో నిర్మిస్తున్న వేళా… భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు, శుక్రవారం ఉదయం జిల్లా ప్యాడి అండ్ రైస్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చి రూ 15 లక్షలు కానుకగా అందించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెన్మెత్స రమేష్ రాజు, కార్యదర్శి భీమాల శ్రీరామూర్తి మాట్లాడుతూ.. దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, సుమారు రూ 4 కోట్లతో శ్రీదుర్గాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్యాడి అండ్ రైస్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు చావ్వకుల నరసింహారావు, భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ అడ్జక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.. గతంలోకి వెళ్ళితే.. సుమారు 4 దశాబ్దాల క్రిందట శ్రీ దుర్గలక్ష్మి అమ్మవారు ఇక్కడ వెలసినప్పుడు స్థానికులు మన ‘సిగ్మా న్యూస్’ ప్రసాద్ తండ్రిగారయిన ‘శలా గణపతి రావు’ (భీమవరం ఫ్లోర్& ఆయిల్ మిల్స్ ప్రెసిడెంట్ ) శ్రీ అమ్మవారి కి ‘వెండి’ నేత్రాలు ,చేతులు, పాదాలు ,కిరీటం చేయించడంతో పాటు ఆలయ నిర్మాణ అభివృద్ధి కి ఎంతగానో కృషి చెయ్యడం జరిగింది. ఇప్పడు పట్టణంలో ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతుంది. అనివార్య పరిస్థితులలో పునర్ నిర్మిస్తున్న ఆలయం మరింత వైభవంగా ఉండాలని కోరుకొందాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *