సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది., ఇందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశముంది. అయితే పలు కంపెనీలకు చెందిన వంట గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగదారులకు మెసేజ్లు, ఫోన్లు చేసి ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని, లేకుంటే గ్యాస్ సిలెండర్లు ఇక రావని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇలా చేయకపోతే సబ్సిడీ కూడా రద్దవు తుందని, ఆంక్షలు విధించే అవకాశముందని భావిస్తున్నారు..
