సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి మువ్వన్నెల పతాకం ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని .. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే.. ఒక తరం కాపాడిందని పేర్కొన్నారు.వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు. కేంద్ర సమన్వయంతో అభివృద్థి పథంలో ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
